మహేశ్ అవుట్..!

బిగ్‌బాస్‌ పన్నెండో వారం ముగింపుకు వచ్చినప్పటికీ రావటం లేదని ప్రేక్షకుల వాదన. ఇప్పటికే మహేశ్‌ బిగ్‌బాస్‌ హౌస్‌ను వీడనున్నాడని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నామినేషన్‌ రౌండ్‌లో వరుణ్‌, రాహుల్‌ ఉన్నందున బాబా భాస్కర్‌, శ్రీముఖి ఫ్యాన్స్‌ ఓట్లు మహేశ్‌కు పడే అవకాశాలు ఎక్కువ. కానీ మహేశ్‌.. శ్రీముఖిని టార్గెట్‌ చేశాడని తెలియడంతో ఆమె ఫ్యాన్స్‌ అతనికి ఓట్లు వేయాలా వద్ద అన్నసందిగ్ధంలో ఉండిపోయారు. అటు బాబాతోనూ సఖ్యతగా ఉండకపోవటం వల్ల అతని అభిమానులు కూడా అదే పరిస్థితిలో కొట్టుమిట్టాడారు. ఈ ఊగిసలాటలోనే వారం అంతా గడిచిపోయింది. మరి ఈ లెక్కన చూస్తే మహేశ్‌కు ఓట్లు తగ్గినట్టేగా! గతంలోనూ నాగ్‌ ఒకసారి మహేశ్‌ను ఎలిమినేట్‌ చేశాడు. కానీ అది టాస్క్‌లో భాగంగా! ఈ సారి మాత్రం ఊరికే కాకుండా నిజంగానే గుడ్‌బై చెప్తారని టాక్‌.. సో ఈ విషయం మహేశ్‌కు ఈకూడా పాటికే అర్థమై ఉంటుంది.

Tags:bigg boss 3eliminationmahesh vitta

Leave a Response