111 రోజులపాటు నిరహారా దీక్ష..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యావరణం, ప్రకృతిని పరిరక్షించాలనే తపనపడే జీడీ అగర్వాల్ ప్రథమ వర్థంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఉద్వేగంగా ప్రసంగించారు.గంగా ప్రక్షాళన కోసం 111 రోజులపాటు నిరహారా దీక్ష చేసి ప్రాణత్యాగానికి పాల్పడిన జీడీ అగర్వాల్ గొప్ప మేధావి. ఐఐటీలో విద్యాభ్యాసంతోపాటు ఉన్నత విద్యకు గొప్పగా కృషి చేసిన జాని. గంగను స్వేచ్ఛగా ప్రవహించాలని, కాలుష్యం బారిన పడకుండా నియంత్రించాలని ప్రొఫెసర్ జీడీ అగర్వాల్ సాగించిన పోరాటం గురించి నాకు తెలుసు. ఆయన సాగించే ఉద్యమం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకొనే వాడిని. గంగ ప్రక్షాళన కోసం నిరాహార దీక్షకు దిగితే.. ఆయన ఆత్మత్యాగం చేయకుండా ప్రభుత్వం స్పందిస్తుందని భావించాను. దురదృష్టం కొద్ది ఏ ప్రభుత్వం ఆయన పోరాటాన్ని పట్టించుకోలేదు అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ సమావేశంలో రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, వాటర మ్యాన్ రాజేంద్ర సింగ్, ప్రొఫెసర్ విక్రమ్ సోని, జనసేన పోలిట్ బ్యూరో సభ్యులు యూసఫ్ అర్హం ఖాన్, బొలిశెట్టి సత్య, బస్వరాజ్ పాటిల్, రమేశ్ శర్మ, మిశ్రా తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Response