టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి కథానాయకుడిగా ఒక సినిమాను తెరకెక్కించడానికి కొరటాల రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి ఇద్దరు కథానాయికలు అవసరమని తెలుస్తోంది. ఒక కథానాయికగా అనుష్క పేరు వినిపిస్తోంది గానీ, క్లారిటీ మాత్రం రాలేదు.
ఇక ఇటీవలే శ్రుతి హాసన్ పేరు తెరపైకి వచ్చింది. ఆమెతో కొరటాల సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిన తరువాత శ్రుతి హాసన్ మళ్లీ సినిమా అవకాశాల కోసం చూస్తోంది. ఈ విషయం తెలిసే కొరటాల ఆమెతో సంప్రదింపులు మొదలెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. శ్రుతిహాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే, మరో నాయికా స్థానం ఎవరిని వరిస్తుందో చూడాలి.