టాలీవుడ్ ప్రేమకథలకు కుటుంబ నేపథ్యాన్ని జోడిస్తూ ఇటు యూత్ ను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను దర్శకుడు శివ నిర్వాణ ఆకట్టుకున్నాడు. ‘నిన్నుకోరి’ .. ‘మజిలీ’ సినిమాలు అందుకు ఉదాహరణలు. ఆయన తాజా సినిమాలో నాని హీరోగా ఉండనుంది. ఆ తరువాత సినిమాను ఆయన విజయ్ దేవరకొండతో చేయనున్నట్టు సమాచారం. పూరి జగన్నాథ్ తో ‘ఫైటర్’ సినిమా చేసిన తరువాత, శివ నిర్వాణతో కలిసి విజయ్ దేవరకొండ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు టాలీవుడ్ లో జిసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ‘ఫైటర్’ తరువాత ‘హీరో’ సినిమాను విజయ్ దేవరకొండ పూర్తిచేయవలసి వుంది. కానీ శివ నిర్వాణ సినిమా తరువాతనే ‘హీరో’పై దృష్టిపెట్టాలని విజయ్ దేవరకొండ నిర్ణయించుకున్నట్టుగా చెబుతున్నారు.
