ముచ్చటగా మూడు…

టాలీవుడ్ లో ‘రన్ రాజా రన్’ సినిమాతో హిట్ కొట్టేసిన దర్శకుడు సుజీత్, తన రెండవ సినిమాగా ‘సాహో’ని అభిమానుల ముందుకు తెచ్చాడు. భారీ బడ్జెట్ తో ప్రభాస్ వంటి స్టార్ హీరోను హ్యాండిల్ చేశాడు. చిన్నవాడే అయినా .. అనుభవం తక్కువే అయినా హాలీవుడ్ రేంజ్ లో తన సత్తా చాటుకున్నాడు. అయితే భారీస్థాయిలో బిజినెస్ జరిగిన కారణంగా ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టడమే కష్టమైంది. ఇక యాంగ్ హీరో శర్వానంద్ కోసం సుజీత్ ఒక కథను సిద్ధం చేసుకున్నాడనీ, త్వరలోనే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కనుందనే టాక్ రెండు మూడు రోజులుగా వైరల్ అవుతుంది. ఈ సినిమాను నిర్మించేది కూడా యూవీ క్రియేషన్స్ వారేననేది టాలీవుడ్ తాజా సమాచారం. సుజీత్ తొలి సినిమా అయిన ‘రన్ రాజా రన్’.. రెండవ సినిమా అయిన ‘సాహో’ను నిర్మించిన యూవీ క్రియేషన్స్ వారే శర్వానంద్ సినిమాను కూడా నిర్మిస్తుండటం టాలీవుడ్ లో విశేషంగా మారింది..

Image result for sujith

Leave a Response