డిఫరెంట్ లుక్స్ తో బాలకృష్ణ…టీజర్

టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ హీరో గా సి.కల్యాణ్ నిర్మాణంలో ‘రూలర్’ సినిమా అభిమానుల ముందుకు వస్తుంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్ .. వేదిక నటించారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను రిలీజ్ సినిమా యూనిట్. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడంలో ముందుండే పోలీస్ ఆఫీసర్ ‘ధర్మ’గా ఈ టీజర్లో బాలకృష్ణ కనిపిస్తున్నాడు. స్టైలీష్ లుక్ లోను ఆయన యాక్షన్ సీన్స్ లో రెచ్చిపోయాడు. యాక్షన్ .. రొమాన్స్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ప్రకాశ్ రాజ్ .. జయసుధ .. భూమిక .. సాయాజీ షిండే ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చేనెల 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Leave a Response