చెయ్యి చూసి జాతకం చెపుతున్న రమ్యకృష్ణ….

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్.. గ్లామరస్ హీరోయిన్ గా టాలీవుడ్ లో నెంబర్ ౧లో ఉన్న హీరోయిన్ రమ్యకృష్ణ. ఇటీవల కాలంలో తన వయసుకి తగిన కీలకమైన పాత్రలను చేస్తూ, తన క్రేజ్ ఎంత మాత్రం తగ్గకుండా చూసుకుంటుంది ఈ సుందరి. అలాంటి రమ్యకృష్ణను గురించి సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు.”అప్పట్లో తెలుగు చిత్రపరిశ్రమలో చెయ్యి చూసి జాతకం చెప్పడం ఒక్క భానుమతిగారికే తెలుసు. అలా జాతకాలు చెప్పడంలో రమ్యకృష్ణ సిద్ధహస్తురాలనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఈ సంగతి నాకు తెలిసి ఆమెను పరీక్షించడం కోసం, నాకు పెళ్లి ఎప్పుడు అవుతుందో .. ఎంతమంది పిల్లలో చెప్పమని రమ్యకృష్ణను అడిగాను. ఆమె నా చేయి చూసి “మీరు నన్ను పరీక్షించడం కోసం అడిగి వుంటారు .. మీ రేఖలు చూస్తుంటే ఈ పాటికే మీకు పెళ్లి అయిపోయి,ముగ్గురు పిల్లలు ఉండి ఉండాలి” అన్నారు. అది నిజమే కావడంతో నేను షాక్ అయ్యాను. జాతకాలు చెప్పడంలో ఆమె దిట్ట అనే విషయం నాకు అప్పుడు అర్థమైంది” అన మాటలు టాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి.

Related image

Leave a Response