‘రాగల 24 గంటల్లో’…?

ఢమరుకం’ ఫేమ్‌ శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. సత్యదేవ్, ఈషా రెబ్బా జంటగా, శ్రీరామ్, గణేశ్‌ వెంకట్రామన్, ముస్కాన్‌ సేథీ ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీ నవ్‌హాస్‌ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్‌ బానర్స్‌పై ఈ చిత్రాన్ని కానూరు శ్రీనివాస్‌ నిర్మించారు.ఈ చిత్రం సెన్సార్‌ పూర్తయింది. శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నన్ను నమ్మి ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్లు ఎంతో కష్టపడి పనిచేశారు. ముఖ్యంగా కానూరు శ్రీనివాస్‌ అభిరుచి గల నిర్మాత. కెమెరా, మ్యూజిక్‌ ఈ చిత్రానికి రెండు కళ్లు. స్క్రిప్ట్‌ నచ్చి కృష్ణభగవాన్‌ ఈ చిత్రానికి డైలాగులు రాశారు’’ అన్నారు. ‘‘మా చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్‌ లభించింది. ఈ నెల 15న చిత్రాన్ని విడుదల చేయనున్నాం. సినిమాలపై ఆసక్తితో ఈ చిత్రాన్ని నిర్మించాను’’ అన్నారు కానూరు శ్రీనివాస్‌. ఈ చిత్రానికి కెమెరా: ‘గరుడవేగ’ అంజి, సంగీతం: రఘు కుంచె.

Leave a Response