మెగాఫ్యామిలీ సినిమాను తెర‌కెక్కించాల‌నుకోవ‌డం లేదన్నాడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌..

వివాద‌స్పద చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఈయ‌న ప్ర‌స్తుతం `క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు` సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. అదే త‌రుణంలో త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌గా `మెగాఫ్యామిలీ` చిత్రాన్ని తెరెక్కించాల‌నుకుంటున‌ట్లు ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. అయితే చివ‌ర‌కు ఆ ప్రాజెక్ట్‌ను తాను చేయాల‌నుకోవ‌డం లేద‌ని తాజాగా ట్వీట్ చేశాడు. అందుకు కార‌ణంగా మెగాఫ్యామిలీ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ధారికి 39 మంది పిల్ల‌లుంటార‌ట‌. చాలా ఎక్కువ మంది పిల్లలు ఉండ‌టం, పిల్ల‌లు సినిమాలు తీయ‌డంలో తన‌కు అనుభవం లేక‌పోవ‌డంతో `మెగాఫ్యామిలీ` సినిమాను తెర‌కెక్కించాల‌నుకోవ‌డం లేదన్నాడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌.

Leave a Response