ఫ్యామిలీ ఫోటోలు వైర‌ల్

యాక్ష‌న్ హీరో గోపిచంద్ ఫ్యామిలీ ప‌ర్స‌న్ అని చెప్ప‌వ‌చ్చు. సినిమాల‌తో ఎంత‌బిజీగా ఉన్న‌ప్ప‌టికి ఫ్యామిలీతో కూడా మంచి టైం స్పెంట్ చేస్తుంటారు. ఆయ‌న 2013 మే నెలలో రేష్మ‌ని వివాహం చేసుకున్నారు . వీరిద్దరికి 2014 అక్టోబర్లో మొదటి అబ్బాయి పుట్టాడు. అతడికి గోపీచంద్ తండ్రి పేరు కలిసి వచ్చేలా విరాట్‌ కృష్ణ అని పేరు పెట్టారు. ఇక గ‌త ఏడాది వినాయ‌క చ‌వితి రోజున మ‌రో అబ్బాయి పుట్టాడు. అత‌నికి వియాన్ అనే పేరు పెట్టారు. రీసెంట్‌గా వియాన్ మొద‌టి బ‌ర్త్‌డే సెల‌బ్రేషన్స్ ఘ‌నంగా జ‌ర‌ప‌గా ఈ వేడుక‌కి యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజ‌ర‌య్యారు. అయితే దీపావ‌ళి రోజు త‌న ఫ్యామిలీతో క‌లిసి గ్రూప్ ఫోటో దిగారు గోపిచంద్. ఈ ఫ్యామిలీ ఫోటోలు అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. గోపిచంద్ స‌తీమ‌ణి రేష్మ .. శ్రీకాంత్ బంధువు అన్న సంగ‌తి తెలిసిందే. బీటెక్ చ‌దివిన రేష్మా త్రీడీ యానిమేష‌న్, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌ల‌పై ప‌ట్టు సాధించింది. ప్ర‌స్తుతం బిను సుబ్రమణ్యం అనే కొత్త ద‌ర్శ‌కుడి డైరెక్ష‌న్‌లోను, సంప‌త్ నంది డైరెక్ష‌న్ లోను సినిమా చేస్తున్నాడు గోపిచంద్.

Leave a Response