దీపావళి పండగను సెలబ్రిటీలు ఎలా జరుపుకుంటారన్నది ఎప్పుడూ ఆసక్తికరమే. అయితే ఎక్కువ మంది సెలబ్రిటీలు వారి ఫ్యామిలీతో కలిసి పండగ జరుపుకోడానికే ఓటేస్తారు. ఈ లిస్టులో ముందు వరుసలో ఉండేది.. టాలీవుడ్ సుందరి కాజల్ అగర్వాల్. దీపావళి పండగను ఆనందమయంగా జరుపుకొన్న క్షణాలను ఈ చందమామ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. సోదరి నిషా అగర్వాల్, ఆమె కొడుకు ఇషాన్‌తో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. నిరాడంబరంగా జరుపుకున్నట్టుగా కనిపిస్తున్న ఫొటోలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. ఇక దీపావళి పండగకు వెలుగులతోపాటు ఆలోచనలను కూడా పంచుకోండని పిలుపునిచ్చింది ఈ ముద్దుగుమ్మ. పనిలో పనిగా బంధాలను మరింత బలోపేతం చేసుకోండని సూచించింది.బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్ కూడా తన ఫ్యామిలీతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ మేరకు భార్య కాజోల్ దేవగన్, కూతురు నైశాతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్లో పంచుకున్నారు. ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు తెలిపాడు. మరో బాలీవుడ్ సంచలన తార సన్నీలియోన్ కూడా తన కుటుంబంతో కలిసి పండగ జరుపుకోడానికే మొగ్గు చూపింది. భర్త డేనియ్ వెబర్‌తోపాటు ముగ్గురు పిల్లలతో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అందజేసింది.
previous article
ముప్పై ఐదు అడుగుల నుంచి వంద అడుగులకు…