రవితేజ కథానాయకుడిగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ రూపొందుతోంది. ఈ సినిమా కోసం రవితేజ ఒక కొత్త లుక్ లో కనిపించి ప్రజలను ఆకట్టుకున్నారు. మరి ఈ సినిమా టీజర్ కోసం రవితేజ ఫాన్స్ తహతహలాడుతున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడానికి ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తోంది.’వినాయక చవితి’ పండుగ సందర్భంగా, వచ్చేనెల 2వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నట్టుగా సమాచారం. టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచే పనిలో దర్శకుడు వీఐ ఆనంద్ వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో, వెన్నెల కిషోర్, సునీల్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారని అంటున్నారు. రాజా ది గ్రేట్ సినిమాతో ఒక పాపులర్ హిట్ అందుకున్నారు. మరి ఈ సినిమా అంతకు మించి హిట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పచ్చు.
previous article
యాత్ర సినిమాలో నా ప్రశ్నకు సుహాసినీగారి సమాధానం..? ఆశ్రిత వేముగంటి
next article
భగత్ సింగ్ విషయంలో గాంధీ చేసిన తప్పులు..?