టీజర్ తర్వాత అభిమానుల్లో వస్తున్న ప్రశ్నలు..?

టాలీవుడ్ హీరో డార్లింగ్ ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత నటిస్తున్న సినిమా సాహో. ఈ సినిమా టీజర్ రిలీజై చాలా కాలం అయినా ఇప్పటికి భారీ వ్యూస్ వస్తున్నాయి. కానీ ఈ సినిమా టీజర్లో సినిమా స్టోరీ కానీ హీరో, హీరోయిన్లకు సంబంధించి ఇల్లాంటి ఇంట్ కూడా ఇవ్వకపోవడంతో అభిమానుల్లో ఆందోళ పెరిగింది. ఐతే ఇప్పుడు దర్శకుడు చిన్న క్లూ ఇచ్చారు. హీరోయిన్ శ్రద్ధ ఈ సినిమాలో పోలీస్ ఆఫిసిర్, తన చేతిలో పాటల సమయంలో తప్ప మిగితా సమయంలో తుపాకీ ఉండటం విశేషం. ఎంతలా అంటే ఆ తుపాకీ తన శరీరంలో ఒక భాగం అని చెప్పవచ్చు. ఇంతకీ మ్యాటర్ ఏంటి అనే ఆలోచన అభిమానుల్లో వస్తుంది. ఇక ప్రభాస్ విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రభాస్ దొంగతంలో చాలా డిఫరెంట్ దొంగ అని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వేళా అదే నిజం అయితే పోలీస్ అయినా శ్రద్ధ ప్రభాస్ లో ఎందుకు లవ్ లో పడ్డింది.? అని అభిమానులు అంటున్నారు.ఇక సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఫర్స్ ఫిల్మ్స్ వారు ఈ సినిమా విదేశీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకున్నారు. ఒక్క మిడిల్ ఈస్ట్ లో మినహా, యశ్ రాజ్ ఫిలిమ్స్ వారితో కలిసి ఫర్స్ ఫిల్మ్స్ వారు విదేశాల్లో సినిమాలను విడుదల చేస్తూ వస్తున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తుంయి. అలా ఫర్స్ ఫిల్మ్స్ వారు ఎన్నో విజయాలను .. లాభాలను సాధించారు. ఈ సంస్థ ‘సాహో’ విదేశీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు సొంతం చేసుకోవడంతో, ‘సాహో’ మరింత భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వెళ్లనుందనే విషయం స్పష్టమవుతోంది. ఇక టీజర్ చూసిన తరువాత అభిమానులు వచ్చిన ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఇంకా కొంత్త కాలం ఎదురు చూడాల్సిందే.

Image result for prabhas and shraddha kapoor

Leave a Response