హిందీ అభిమానుల ముందకు జెర్సీ..

టాలీవుడ్ యాంగ్ హీరో నాని. తన నటనతో టాలీవుడ్ లో అందరిని తన వైపు తిప్పుకున్నాడు. తాను టాలీవుడ్ లో ఎన్నో సినిమాలో నటించి తనకంటూ ఓ స్థాయిని తెచ్చుకున్నాడు. అష్టా చమ్మా సినిమాతో తెలుగులోతన సినీ జీవితం మొదలు పెట్టాడు. ఆ సినిమా తర్వాత తెలుగు ఎన్నోసినిమాలతో అభిమానుల ముందుకు వచ్చాడు. ఇక ప్రథమార్ధంలో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం, MCA(మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రంలతో వరుసగా ఎనిమిది విజయాలను అందుకున్నాడు. నాని నిర్మాతగా డీ ఫర్ దోపిడీ అనే చిత్రాన్ని నిర్మించారు. అ! అనే చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా కూడా విజయాన్ని అందుకున్నాడు. 2019లో జెర్సీ సినిమాతో మన ముందుకు వచ్చాడు.ఇక విషయానికి వస్తే.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో అభిమానుల ముందుకు వచ్చిన సినిమా ‘జెర్సీ’. ఈసినిమా టాలీవుడ్ లో మంచి ప్రశంసలు అందుకుందన విషయం మన అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమా నాని కెరియర్లో చెప్పుకోదగిన సినిమా నిలిచింది. అలాంటి ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేస్తున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. క్రికెట్ నేపథ్యంలో సాగే కథ .. మనసును తాకే ఎమోషన్స్ ను తనలో కలుపుకున్న కథగా మన తెలుగు అభిమానుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా హిందీ ప్రేక్షకులకి బాగా నచ్చుతుందని భావించిన కరణ్ జొహార్, రీమేక్ హక్కులను కొనుగోలు చేసినట్టుగా ఈ సినిమా దర్శకుడు తెలియజేయడం విశేషం. తెలుగులో ఈ సినిమాను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరినే హిందీలోనూ దర్శకత్వం చేయమన్నట్టుగా టాక్. నాని పాత్రలో షాహిద్ కపూర్ ను ఎంపిక చేయనున్నారని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని అంటున్నారు. ఈ సినిమా హిందీలో ఎల్లా ఉంటుందో చూడాలి మారి.

Image result for nani wikipedia in telugu

Leave a Response