విద్యుత్తు ఒప్పందాలతో రూ.2000 కోట్ల నష్టం

విద్యుత్తు ఒప్పందాలతో రూ.2000 కోట్ల నష్టం
మాజీ ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్తు ఒప్పందాల్లో అవినీతివల్ల ఏడాదికి రూ.2000 కోట్లకుపైగా నష్టం వాటిల్లుతోందని ప్రాథమికంగా అర్థమవుతోందని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. ఈ నిధులను మనం ఆదా చేయగలిగితే రైతులకు పెట్టుబడి రాయితీగా చెల్లించే అవకాశముంది కదా? అని చెప్పినట్లు సమాచారం. ‘ప్రజలకు ముందుకు ఈ విషయం తీసుకెళ్లి ప్రజలకు అర్ధమైలా స్పష్టంగా చెబుదాం. ఆ సొమ్ముతో ప్రజలకు ఎలా మంచి చేస్తున్నామని చెప్పే చేద్దాం’ అని జగన్‌ పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలవల్ల దాదాపు 15శాతం నుంచి 20శాతం వరకు ప్రజాధనం ఆదా అయ్యే అవకాశముందని అన్నారు. పోలవరం, వెలిగొండ, వంశధార ప్రాజెక్టులతోపాటు విద్యుత్తు ఒప్పందాలు, అర్బన్‌ గృహ నిర్మాణంలో అవకతవకలను వెంటనే వెలికి తీయాలని సీఎం ఆదేశించారు. భూకేటాయింపులపైనా దృష్టి సారించాలని ఈ సందర్భముగా సూచించారు. గత ప్రభుత్వంలో కొంతమందికి ప్రయోజనం కల్పించేందుకు ప్రత్యేకంగా తీసుకున్న నిర్ణయాలున్నాయని, వాటిపై దృష్టి సారించాలని సీఎం జగన్ అన్నారు. అర్బన్‌ గృహ నిర్మాణంలో బాగా అవకతవకలు జరిగాయని సీఎం చెబుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ధరలతో పోలిస్తే యూనిట్‌కు రూ.630 వరకు ఎక్కువ ఉందని, ఇంకా పక్కాగా పరిశీలిస్తే రూ.900 వరకు అధిక ధరలు చెల్లించిన పరిస్థితులు వెలుగులోకి రావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Leave a Response