తెలుగులో కథా బలమున్న చిత్రాలలో .. బరువైన పాత్రల్లో నటించి మెప్పించిన కథానాయికలలో ‘ఆమని’ ఒకరు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. “తెలుగులో బాపు .. కె.విశ్వనాథ్ గారి సినిమాలలో నటించే అవకాశం రావడం నేను చేసుకున్న అదృష్టం. నేను చేసిన సినిమాలన్నీ నాకు బాగా నచ్చినవే .. అయితే వాటిలో ‘శుభసంకల్పం’ స్థానం ప్రత్యేకం.నిర్మాతగా బాలసుబ్రహ్మణ్యం గారు .. దర్శకుడిగా కె. విశ్వనాథ్ గారు .. హీరోగా కమలహాసన్ గారు అందరూ దిగ్గజాలే. అలాంటివారితో కలిసి పనిచేయవలసి వచ్చింది. అలాంటి అవకాశం వచ్చినందుకు ఒక వైపున ఆనందం .. మరో వైపున చేయగలనా? లేదా? అనే భయం. ఇక కమల్ సరసన నటించడానికి వెళ్లగానే ‘దడ’ పుట్టేసింది. కానీ ఆయన పాత్రలో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతారు .. మనం ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తారు. అక్కడ పాత్రలే ఉంటాయి కనుక .. ఎలాంటి టెన్షన్ లేకుండా చేయగలిగాను” అని చెప్పుకొచ్చారు.
                  previous article 
                  
                
                    టాలీవుడ్ ప్రముఖుల ఫై ఐటీ దాడులు
                  
                
                  next article 
                  
              
                    ఏపీలో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీషు మీడియం విద్య
                  
                