పూర్తి పేరు నవీన్ కుమార్ గౌడ , రంగస్థల కన్నడ స్టార్ హీరో యష్ ఆయన 2009 లో, యశ్ తన మొగ్గినా మనసు చిత్రం కోసం ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ లో ఉత్తమ సహాయ నటుడు – కన్నడను గెలుచుకున్నాడు.
డ్రామా (2013), గూగ్లీ (2014) చిత్రాలకు యష్ ఉత్తమ నటుడు – కన్నడకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో ఎంపికయ్యాడు .2015 లో, యష్ ఉత్తమ నటుడు – కన్నడను ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్, సినీ అవార్డులలో సాధించాడు. కొంతకాలం క్రితం చేసిన ‘కేజీఎఫ్’ సంచలన విజయాన్ని సాధించింది. దాంతో ప్రస్తుతం ఆ సినిమాకి సీక్వెల్ ను రూపొందిస్తున్నారు. ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ టైటిల్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ చాఫ్టర్ లో ప్రతినాయకుడిగా సంజయ్ దత్ కనిపించనున్నాడు.
ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను కోలార్ ఫీల్డ్స్ లోని ‘సైనైడ్ హిల్స్’లో కొన్ని రోజులుగా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగు వలన అక్కడి పర్యావరణం దెబ్బతింటోందంటూ కర్ణాటక ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కోర్టులో ‘పిల్’ వేశాడు. దీనిపై ఈ రోజున విచారణ జరిపిన న్యాయస్థానం, అక్కడ జరుపుతోన్న షూటింగ్ వెంటనే నిలిపివేయాలని తీర్పునిచ్చింది. దాంతో ఈ సినిమా షూటింగుకి ఊహించని ఆటంకం ఏర్పడింది. అదే తరహా లొకేషన్ ఎక్కడుందో గాలించాలనీ, దొరకని పక్షంలో సెట్ వేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం.