బిత్తిరి సత్తి అంటే తెలియని వారు ఉండరు. v6 ఛానెల్ ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన కొత్తరకం భాషతో, నటనతో ప్రజలను ఆకట్టుకున్నాడు. అతని టేలెంట్ మరియు ఫాలోయింగ్ చూసి సినిమాలు సైతం అతన్ని వెతుకుంటూ వచ్చాయి. సినిమాలలో కూడా మంచి కామెడీ కేరెక్టర్లు చేసాడు. ఇక అసలు విషయానికి వెళ్తే ఇప్పుడు తినకున్న పాపులారిటికి tv9 సైతం మంచి ఆఫర్ ఇచ్చింది. ఇక బిత్తిరి సత్తి ఆగుతాడా ఇక దొరికింది ఛాన్స్ అంటూ వెళ్లి జాయిన్ కూడా అయ్యాడు. ఇదంతా మనకెలా తెలిసిందంటే తను ఒక వీడీయో క్లిపింగ్ చేసి మరి పోస్ట్ చేసాడు. అంతే కాకుండా v6 ఛానెల్ లో తనను చాలా బాగా చూసారని కానీ ఇది తనకి ఒక ప్రమోషన్ లాంటిదని చెప్పుకొచ్చాడు. అన్నం పెట్టిన ఛానెల్ కే అన్యాయం చేసావంటూ కొంతమంది సత్తి మీద ఫైర్ అవుతున్నారు ,తిడుతున్నారు. మరి సత్తి చేసింది ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలియని విషయం. ఎలాగైతేనే అల్ ది బెస్ట్ బిత్తిరి సత్తి
previous article
కెరియర్ కోసం భయపడకుండ..?నాగార్జున
next article
సింహం గడ్డితింటుందా..? అవును