గోదావరిలో బోటు ప్రమాదం జరిగి వారాలు గడుస్తున్నా బోటును వెలికితీయలేదు. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ దీనిపై ఘాటుగా స్పందించారు. ప్రమాదం వెనుకున్న నిజాలు వెల్లడించినందుకు దళితనాయకుడు హర్షకుమార్ ను కేసుల పేరుతో వేధిస్తున్నారని అన్నారు. బోటు ప్రమాదం వెనుకున్న రహస్యాన్ని జలసమాధి చెయ్యాలని చూసినంత మాత్రాన నిజాలు దాగవని మండిపడ్డారు. గోదావరిలో 144 సెక్షన్ పెట్టిన మేధావి వైఎస్ జగన్ మునిగిపోయిన బోటును బయటికి తీయలేడా అంటూ నిలదీశారు.ఈ ప్రభుత్వానికి సిగ్గుగా లేదా? ఇది చేతకాని దద్దమ్మ ప్రభుత్వం అనడానికి ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలని అని అన్నారు. రోజు డ్యూటీలో ఉన్న ఎస్సైకి ఫోన్ చేసి బోటును వదిలిపెట్టాలని ఒత్తిడి చేసిన వ్యక్తి పేరు బయటపెట్టాలని లోకేశ్ డిమాండ్ చేశారు.