రేణిగుంట ఎంవీఐ అక్రమాస్తులు రూ.100 కోట్లు

తిరుపతి: ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో చిత్తూరు జిల్లా రేణిగుంట ఆర్టీఏ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న విజయ్ భాస్కర్ నివాసంలో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. తిరుపతి శ్రీనివాసపురంలో విజయ్ భాస్కర్ నివాసం ఉంటున్న ఇల్లు, నగరంలోని పద్మావతిపురం సహా చంద్రగిరి, అనంతపురం, చెన్నై, బెంగుళూరులోని అతని బంధువులు, సన్నిహితుల నివాసాల్లో ఏకకాలంలో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. శనివారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటలకు వరకూ నిర్వహించిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించారు. రూ.4కోట్ల 47లక్షల 10వేల విలువైన స్థిరాస్తులు, రూ.3.50 కోట్ల విలువైన చరాస్తులు గుర్తించారు. మార్కెట్‌ విలువ ప్రకారం ఆస్తి విలువ రూ.100 కోట్లు ఉంటుందని అంచనావేసిన అనిశా అధికారులు విజయ్‌ భాస్కర్‌ను అరెస్టు చేశారు. అవినీతి ఆరోపణలతో 2011లోనూ విజయభాస్కర్‌ అరెస్టయ్యారు.

Leave a Response