పాకిస్థాన్‌ పైన భారత్‌ విజయభేరీ….

 యావత్‌ క్రికెట్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానేవచ్చింది. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ మాంచెస్టర్‌ వేదికగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా.మరోవైపు భారత్‌ను ఓడించాలన్న కసితో పాక్‌ కూడా సన్నద్ధమయిం. కాగా 1992 నుంచి 2015 వరకు ఆరుసార్లు ప్రపంచకప్‌లో తలపడగా టీమిండియానే విజయఢంకా మోగించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా భారత్‌ గెలవాలని కోట్లాది మంది భారత అభిమానులు ఆకాంక్షిస్తున్నారు ఇదిలా ఉండగా ఉగ్రదాడుల కారణంగా రెండు దేశాల మధ్య క్రికెట్‌ సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. గతకొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య దైపాక్షిక సిరీస్‌లు కూడా జరగడం లేదు. ఐసీసీ టోర్నమెంట్లలో పాల్గొన్నప్పుడే చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నార అయితే పుల్వామా ఉగ్రదాడి అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను రద్దు చేసుకోవాలని భారత్‌లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. కాగా టీమిండియా వీటన్నింటిని పక్కన పెట్టేసి ప్రపంచప్‌లో అడుగుపెట్టింది. ఇప్పటికే రెండు వరుస విజయాలు సాధించిన కోహ్లేసేన పాక్‌పై గెలిచి తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత అభిమానులు బలంగా కోరుకుంటున్నారు భారత అభిమానులు కోరుకునా విదంగా పాక్‌ పైన భారత్‌ మరో విజయభేరీ

.

Leave a Response