హిందీ దబింగ్… రాక్షసుడు

టాలీవుడ్ యాంగ్ హీరో బెల్లంకొండా సాయి శ్రీనివాస్‌. తాను హీరోగా అభిమానులు ముందుకు వస్తున్న సినిమా రీమేక్‌ మూవీ రాక్షసుడు. ఈ సినిమా తమిళ్‌లో ఘన విజయం సాధించిన రాక్షసన్‌ సినిమాను రమేష్‌ వర్మ దర్శకత్వంలో తెలుగులో విడుదల కాబోతుంది. ఇటీవల రిలీజ్‌ అయిన రాక్షసుడు టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ రావటంతో హిందీ డబ్బింగ్ రైట్స్‌కు భారీ ఆఫర్‌ వచ్చినట్టుగా టాలీవుడ్ టాక్. గతంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా వచ్చిన సినిమాల హిందీ డబ్బింగ్‌ వర్షన్‌లు యూట్యూబ్‌లో భారీగా వ్యూస్‌ సాధించాయి. దీంతో రాక్షసుడు హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ కోసం 12.5 కోట్లు ఆఫర్‌ చేశారట. కంటెట్‌పరంగా కూడా యూనివర్సల్‌ అప్రోచ్‌ ఉంటుందన్న నమ్మకంతో భారీ ఆఫర్‌లు వచ్చినట్టుగా టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా తెలుగు శాటిలైట్‌ రైట్స్‌ కూడా 6 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఎక్కువ సన్నివేశాలు తమిళ ఒరిజినల్‌ వర్షన్‌లో చిత్రీకరించినవే వాడుతున్నారు. కేవలం హీరో హీరోయిన్లు కనిపించే సీన్స్‌ను మాత్రమే రీ షూట్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

Image result for rakshasudu

Leave a Response