గాయపడి మరో హీరో…

‘స్నేహగీతం, ప్రస్థానం’ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు సందీప్‌కిషన్‌ బాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని 2010లో టాప్‌ 3 చిత్రాల్లో ఒకటైన ‘షోర్‌ ఇన్‌ ద సిటీ’ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమై అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాడు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ తాజాగా రాణాల తరువాత హిందీ సినిమాల్లో నటిస్తున్న హీరోగా సందీప్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్‌లో టాప్‌ మూవీస్‌లో హీరోగా అవకాశం తెచ్చుకున్న సందీప్‌ తెలుగు వాడు. తెలుగులో ‘ఎల్‌.బి.డబ్యూ’ఫేం ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో మిక్కీ.జే.మేయర్‌ సంగీత దర్శకత్వంలో రూపోందుతున్న రోటీన్‌ లవ్‌స్టోరిలో సోలో హీరోగా చేస్తూ తమిళంలో రెడ్‌పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపుదిద్దుకుటున్న ‘యారుడ మహేష్‌’ అనే చిత్రం కూడా చేస్తుండడం విశేషం. ఈ రెండు చిత్రాలు 70% చిత్రీకరణ పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. మంచు లక్ష్మి నిర్మాతగా మాస్ట్రో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘గుండెల్లో గోదారి’ అనే మల్టీ స్టారర్‌ చిత్రంలో సందీప్‌కిషన్‌తో పాటు ఆది పినిశెట్టి, తాప్సీ మరియు మంచు లక్ష్మి నటిస్తున్నారు. ఇందులో మాస్‌ యాక్షన్‌ హీరోగా తన పాత్ర వుండడం విశేషం. అలాగే ‘ఓరు’ ఫేం ఆనంద్‌రంగా నిర్మిసున్న ద్విభాషా చిత్రంలో కూడా సందీప్‌కిషన్‌ హీరోగా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రం ఔట్‌ అండ్‌ ఔట్‌ కామెడీ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది. ఇక మీడియా విశాలో తాను చాలా చూరుగా ఉంటారు. ప్రస్తుతం మన హీరో గాయాలతో బాధపడుతున్నాడు. ఈ మధ్య కాలంలో వరుసగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ‘తెనాలి రామకృష్ణ’ సినిమా చిత్రీకరణలో భాగంగా శనివారం సందీప్‌కిషన్‌ గాయపడ్డారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం అభిమానుల ముందుకు వస్తున్న సినిమా ప్రస్తుతం కర్నూలులో షూటింగ్‌ జరుపుకొంటోంది. ఈ సందర్భంగా జరిగిన బాంబ్‌ బ్లాస్ట్‌ సన్నివేశంలో సందీప్‌ గాయపడ్డారు. వెంటనే యూనిట్‌ సభ్యులు ఆయన్ను కర్నూలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫైట్‌ మాస్టర్‌ సమన్వయ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని చిత్ర బృందం తెలిపింది. ప్రాథమిక చికిత్స అనంతరం సందీప్ కిషన్‌ను కర్నూలు నుంచి హైదరాబాద్ తరలించారు. ఇక మన వాడు ఎప్పుడు కోలుకుంటాడో చూడాలి. ఈ విషయాని దర్శకుడు తన అభిమానులతో షేర్ చేసుకున్నారు.

Image result for sundeep kishan wikipedia in telugu

Leave a Response