బీజేపీ నేతలు లంచాలు పంపిస్తున్నారు: ప్రియాంక గాంధీ

సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె అమేథీలో పర్యటించారు. ‘అమేథీ పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామ పెద్దలకు బీజేపీ నేతలు లంచాలు పంపిస్తున్నారు’ అని ప్రియాంక గాంధీ ఆరోపించారు. గ్రామ పెద్దలకు రూ.20,000 ఇవ్వడం ద్వారా వారి ప్రేమాభిమానాలను పొందేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించిన ఆమె.. అమేథీ ప్రజలు డబ్బులకు అమ్ముడుపోరని వివరించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ అమేథీలో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాల పనులను బీజేపీ ప్రభుత్వం నిలిపివేసిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఇదే సమయంలో అమేథీ బీజేపీ ఎంపీ అభ్యర్థి సృతి ఇరానీపై విమర్శలు గుప్పించారు.

Leave a Response