హృదయాల్ని కదిలిస్తున్న..‘ఇదే కదా నీ కథ’

అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు నటించిన చిత్రం ‘మహర్షి’. ఈ సినిమాలోని ‘ఇదే కదా నీ కథ’ అనే పాట లిరికల్‌ వీడియోను ‘ది సోల్‌ ఆఫ్‌ రిషి’ అంటూ చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. ఇందులో మహేశ్‌ రైతుల అభివృద్ధి కోసం ఆలోచిస్తూ కనిపించారు. వారితో కలిసి పొలం పనులు కూడా చేశారు. ఈ పాటను విజయ్‌ ప్రకాశ్‌ ఆలపించారు. శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందించారు. ఈ పాటకు యూట్యూబ్‌లో విశేషమైన స్పందన లభిస్తోంది.
‘మహర్షి’ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే కథానాయిక. అల్లరి నరేష్‌, మీనాక్షి దీక్షిత్‌, సోనాల్‌ చౌహాన్‌, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌ రాజ్‌, పోసాని, రావు రమేశ్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. దిల్‌రాజు, అశ్వినీ దత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. సెన్సార్‌ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్‌ పొందిన ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌ ప్రస్తుతం యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో అగ్ర స్థానంలో ఉంది. 96 లక్షల మందికిపైగా ప్రచార చిత్రాన్ని చూశారు.

Leave a Response