మేమెంత అదృష్టవంతులమో!

‘సినీ తారలుగా మేం పడే కష్టానికీ, మాకొచ్చే పేరుకీ, ప్రతిఫలానికీ అస్సలు సంబంధమే ఉండదు. మాకంటే కష్టపడేవాళ్లు మా చుట్టూ చాలామందే ఉంటారు. వాళ్లకు సరైన గుర్తింపు ఉండదు. వాళ్లతో పోలిస్తే మేమెంత అదృష్టవంతులమో అనిపిస్తుంది అనుపమ పరమేశ్వరన్‌. మీకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు ఎవరు? అనే ప్రశ్నకు తను సమాధానం చెబుతూ ‘‘నా చుట్టూ ఉన్నవాళ్లందరూ నాకు ఎప్పటికప్పుడు స్ఫూర్తినిస్తుంటారు. సెట్లో సహాయకులు ఎంత కష్టపడుతుంటారో నేను చూస్తూనే ఉంటా. వాళ్ల శ్రమ ముందు నేను పడే కష్టమెంత? అనిపిస్తుంది. సినిమా రంగంలోనే కాదు, అన్ని రంగాల్లోనూ ఇలాంటి ఓ వర్గం ఉంటుంది. వాళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం అందకపోయినా ఆనందంగా బతికేస్తుంటారు. వచ్చిన దానితో సంతృప్తి చెందడం, చిన్న చిన్న ఆనందాల కోసం జీవన యానం సాగించడం చాలా గొప్ప విషయం’’ అంది అనుపమ.

Leave a Response