బీసీసీఐ వార్షిక సమావేశంలో దాదా బిసిసిఐ అధ్యక్షుడిగా బాధ్యతను స్వీకరించారు. కార్యదర్శిగా అమిత్ షా కొడుకు జైషా, ఉపాధ్యక్షుడిగా ఉత్తరాఖండ్ కు చెందిన మహిమ్ వర్మా, కోశాధికారిగా కేంద్రమంత్రి బిసిసిఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ ధుమాల్, మరో కోశాధికారిగా కేరళకు చెందిన జయేశ్ జార్జి సంయుక్త కార్యదర్శి గానూ బాధ్యతలు స్వీకరించారు. టీమిండియా కెప్టెన్ గా తనదైన ముద్ర వేసిన గంగూలీ బిసిసిఐని ఎలా నడిపిస్తాడో అనేది ఆసక్తికరంగా మారింది. బిసిసిఐకి మునుపటి ఇమేజ్ ను తీసుకురావటం పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన, ఫస్ట్ క్లాస్ క్రికెట్ ను మరింత మెరుగుపరచడం, ఐసీసీలో బిసిసిఐ పరపతిని పెంచటం ఇలా అనేక సవాళ్లు గంగూలీ ముందున్నాయి. దీంతో తొమ్మిది నెలల పార్ట్ టైమ్ లో బిసిసిఐని గంగూలీ ఎలా ఎదురుకుంటాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.పూర్తిస్థాయి బిసిసిఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం చివరిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో విజయనగరం మహారాజు విజయానంద గజపతి రాజుకే దక్కింది. అతడు భారత మాజీ కెప్టెన్ కూడా రెండు వేల పద్నాలుగులో సునీల్ గవాస్కర్, శివలాల్ యాదవ్ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించారు. కానీ కొన్ని నెలలు మాత్రమే తాత్కాలిక విధుల్లో ఉన్నారు.ఒక మాజీ క్రికెటర్ పూర్తిస్థాయి బిసిసిఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం అరవై ఐదేళ్లలో ఇదే తొలిసారి.టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ బీసీసీఐ పగ్గాలను అందుకున్నారు. బుధవారం బిసిసిఐ ముప్పై తొమ్మిది వ బాస్ గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ముప్పై మూడు నెలల సీఓఏ పాలనకు ఫుల్ స్టాప్ పడనుంది. బిసిసిఐ అధ్యక్షుడిగా గంగూలీ తొమ్మిది నెలల పాటు పదవిలో ఉండనున్నారు. లోధా నిబంధనల ప్రకారం క్రియాశీలకంగా వరుసగా ఆరు సంవత్సరాలకు మించి పదవిలో ఉండరాదు. ఇప్పటికే గంగూలీ క్యాబ్ అధ్యక్షుడిగా ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. దీంతో దాదా జులై వరకే బిసిసిఐ అధ్యక్ష పదవిలో ఉంటారు. నిజానికి బీసీసీఐ ఎన్నికలు బుధవారం జరగాలి. కానీ పోటీ లేకపోవటంతో బీసీసీఐ టాప్ పోస్ట్ కు దాదా మాత్రమే నామినేషన్ వేశారు.