నిన్న గుంటూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న మేస్త్రీ నాగ బ్రహ్మాజీ ఉదంతం తనను తీవ్రంగా కలచివేసిందని పవన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఏపీలో ఇసుక కొరత లక్షలాదిమంది కార్మికుల పొట్ట కొడుతోందని జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేస్త్రీ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థికసాయం ప్రకటించారు.నాగ బ్రహ్మాజీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని పవన్ అన్నారు. పనిలేని కార్మికుల కుటుంబాలు ఇప్పుడేం చేయాలో తెలియని స్థితిలో పడిపోయారని విమర్శించారు.నాగ బ్రహ్మాజీ ఆత్మహత్య ఏపీలోని భవన నిర్మాణ రంగ కార్మికుల దయనీయ స్థితికి నిదర్శనం అని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ అస్తవ్యస్త ఇసుక విధానం కారణంగా రాష్ట్రంలోని 19.6 లక్షల మంది కార్మికులు నేరుగా ప్రభావితం కాగా, మరో 10 లక్షల మంది పరోక్షంగా ఉపాధి కోల్పోయారని పవన్ తెలిపారు.
Tags:pawan kalyan
previous article
తనకు నచ్చినప్పుడు ఆటకు వీడ్కోలు పలికే హక్కు ధోనీకి ఉంది – శాస్త్రి
next article
పవన్ కుమార్తె ఆద్య చరణ్ సినిమాకు డైరెక్ట్..