శుక్రవారం మంగళగిరి పర్యటనకు నారా లోకేష్‌

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఉదయం మంగళగిరికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రముఖులు, నేతలను ఆయన కలవనున్నారు. మంత్రి లోకేష్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తొలుత ఆయన విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించినా రాజకీయ సమీకరణల మధ్య ఆయన మంగళగిరి నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. దీంతో ఆయన శుక్రవారం మంగళగిరికి చేరుకుని ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై స్థానిక నేతలతో సమావేశం కానున్నారు.

Leave a Response