రాజమౌళి సినిమా తరువాత మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేసిన చరణ్

ప్రస్తుతం చరణ్ .. ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగులో బిజీగా వున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా కోసం చరణ్ వరుసగా డేట్స్ ఇచ్చాడు. అందువలన ఆయన ఆ తరువాత ప్రాజెక్టును సెట్ చేసుకోవడానికి కొంత సమయం పట్టొచ్చని అంతా అనుకున్నారు. కానీ ఒక వైపున ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగులో పాల్గొంటూనే, ఆ తరువాత ప్రాజెక్టును చరణ్ లైన్లో పెట్టేశాడనేది తాజా సమాచారం.’ఆర్ ఆర్ ఆర్’ షూటింగు నుంచి ఏ మాత్రం గ్యాప్ దొరికినా చరణ్ కొత్త కథలను వింటూ వచ్చాడట. అలా కొన్ని కథలను విన్న ఆయనకి ఒక కథ చాలా బాగా నచ్చేసిందట. గీతా ఆర్ట్స్ సినిమాలకి కొంతకాలంగా సహాయ దర్శకుడిగా పనిచేస్తోన్న ఒక యువకుడు ఈ కథను వినిపించినట్టు తెలుస్తోంది. ‘ఆర్ ఆర్ ఆర్’లో తన పోర్షన్ పూర్తయ్యేలోగా .. పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసి ఉంచమని ఆ యువకుడికి చరణ్ చెప్పాడట. గీతా ఆర్ట్స్ బ్యానర్లో సంక్రాంతి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం.

Leave a Response