ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథాంశంపై రూపొందించిన పీఎం నరేంద్ర మోదీ సినిమాను ఏప్రిల్ 12వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను ఒమంగ్ కుమార్ డైరక్ట్ చేశాడు. ఈ ఏడాది జనవరిలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ప్రధాని మోదీ పాత్రలో వివేక్ ఒబరాయ్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ముంబైలో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్నది. ఎక్కువ శాతం సినిమాను ఉత్తరాఖండ్‌లో షూట్ చేశారు. మోదీ బాల్యం, ఆ తర్వాత రాజకీయ ప్రవేశం గురించి ఫిల్మ్‌లో చూపించనున్నారు. గుజరాత్ సీఎం నుంచి 2014లో లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సృష్టించిన ప్రభంజనాన్ని కూడా ఫిల్మ్‌లో ప్రజెంట్ చేయనున్నారు. ఈ సినిమా పోస్టర్‌ను మొత్తం 27 భాషల్లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దర్శన్ కుమార్, బొమన్ ఇరానీ, మనోజ్ జోషీ, ప్రశాంత్ నారాయణన్, జరీనా వాహబ్, సేన్‌గుప్తాలు ఇతర పాత్రల్లో నటిస్తున్నట్లు నిర్మాత సందీప్ సింగ్ తెలిపారు.
previous article
వైఎస్ వివేకానందరెడ్డికి జగన్ నివాళి
next article
దక్షిణాదిలోనూ రాహుల్ పోటీ?