తండ్రి మాట కాదనలేకే చేసిందట

టాలీవుడ్ సుందరి ఒక సినిమాతో ‘మహానటి’గా పేరు సంపాదించేసింది కీర్తిసురేశ్‌. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి ఈ మధ్యన ఎన్నికల ప్రచారంలో పాల్గొని అనుమానాలకు తావిచ్చింది. అవేంటంటే ఎన్నికల ప్రచారం చేయడమే కాకుండా, ప్రధానిని కలవడంతో త్వరలోనే రీల్‌ సావిత్రి రాజకీయాల్లోకి రాబోతోందని గుసగుసలు వినబడ్డాయి. అయితే ఇప్పటివరకు కీర్తి ఈ వార్తలపై నోరు మెదపలేదుగానీ, ఆమె తల్లి మాత్రం తండ్రి కోసమే కీర్తి ఎన్నికల ప్రచారంలో పాల్గొందని క్లారిటీ ఇచ్చింది. కీర్తికి ఇప్పుడే రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని, కేవలం తండ్రి మాటకాదనలేకనే ప్రచారంలో పాల్గొందని చెప్పింది. అయితే తండ్రి అడిగితే రాజకీయాల్లో చేరిపోతుందన్నమాట.. అని అనుకుంటున్నారు సినీజనాలు.

Related image

Leave a Response