పూజా హెగ్డే బుకాయిస్తోంది…

టాలీవుడ్ మిల్క్ బాయ్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా ‘మహర్షి’. విజయంతో టాలీవుడ్‌లో మంచి సక్సెస్‌ను ఖాతాలో వేసుకుంది పూజా హెగ్డే. మొదట్లో వరుసగా ప్లాఫ్‌లు పలకరించినా ఈ అమ్మడుకి అవకాశాలు మాత్రం తగ్గలేదు. ‘అరవిందసమేత’ బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించడంతో కాస్త నిలదొక్కుకుంది. ఇక ఇప్పుడు ‘మహర్షి’ వందకోట్ల క్లబ్‌లో చేరిపోవడంతో తన అదృష్టానికి తానే మురిసిపోతోందట. అందుకే ఒక్కసారిగా పారితోషికాన్ని రెండింతలు చేసిందని, మెగా హీరో సినిమాకి కూడా నో చెప్పిందని వార్తలొచ్చాయి. అయితే అలాంటిదేం లేదని బుకాయిస్తోంది పూజ. కానీ మెగాహీరోని, బ్రేకిచ్చిన డైరెక్టర్‌ సినిమాని కాదంటుందంటే అది కచ్చితంగా ‘మహర్షి’ ఎఫెక్టే అనుకుంటున్నారు టాలీవుడ్‌ జనాలు.

Image result for pooja hegde

Leave a Response