అండా బిరియని … అనుపమ…

టాలీవుడ్ హీరోయిన్లలో భోజనప్రియులు ఎంత మంది ఉంటారు? ‘నేనున్నానోచ్‌’ అని గట్టిగా చెప్పే రకుల్‌ప్రీత్‌సింగ్‌, తమన్నాలాంటి వారు అరుదుగానే కనిపిస్తుంటారు. తాజాగా వీరి కోవలోకి చేరుతున్నారు అనుపమ పరమేశ్వరన్‌. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె అండా బిర్యానీ పొటోను పోస్ట్‌ చేసి ‘ఇక్కడ బిర్యానీ లవర్స్‌ ఎంత మంది ఉన్నారు’ అని పెట్టిన క్యాప్షన్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇన్‌స్టాలోనే కాదు… అటు టిక్‌టాక్‌లు, ఇటు ట్విట్టర్‌… ఏ మాధ్యమంలోనైనా యాక్టివ్‌గా ఉండటానికి ప్రయత్నిస్తుంటారామె. దీని గురించి మాట్లాడుతూ ‘‘హీరోయిన్‌గా ఉన్నప్పుడైతే ఫర్వాలేదు. ఖాళీ దొరుకుతుందనుకోవచ్చు. ఇప్పుడు అదనంగా అసిస్టెంట్‌ డైరక్టర్‌గా బాధ్యతల్ని భుజాన వేసుకున్నాక కూడా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండటానికి తీరిక ఎక్కడ దొరుకుతుంది? అని కొందరు అడుగుతుంటారు. వారికి చిరునవ్వుతో సమాధానం చెబుతుంటాను’’ అని అన్నారు అనుపమ.

Image result for anupama

Leave a Response