టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా సైరా. ఈ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో విడుదలై మంచి విజయం సాధించింది. సైరా
తర్వాత సురేందర్ చేయబోయే సినిమా గురించి ఇప్పటివరకు క్లారిటీ లేదు.టాలీవుడ్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ప్రభాస్ లేదా పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని సురేందర్ రెడ్డి భావిస్తున్నాడట. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సహకారంతో ఇటీవల ప్రభాస్‌ను కలిసి కథ వినిపించాడట. కథ ప్రభాస్‌కు నచ్చిందట. అయితే మే నెల తర్వాతే ప్రభాస్ ఫ్రీ అవుతాడట. తాజాగా పవన్‌ను కూడా సురేందర్ రెడ్డి కలిసినట్టు వార్తలు వస్తున్నాయి. పవన్, సురేందర్ కలయికలో సినిమా చేయాలని మైత్రీ మూవీస్ సంస్థ భావిస్తోందట. పవన్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. అయితే సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతానికి పవన్, ప్రభాస్ కోసం సురేందర్ రెడ్డి స్క్రిప్టులు సిద్ధం చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.