100 మంది నటిస్తున్న సినిమా…?

సీనియర్ హీరో వెంకటేశ్.. జూనియర్ హీరో నాగచైతన్య హీరోలుగా చేస్తున్న సినిమా ‘వెంకీమామ’. ఈ సినిమా సురేశ్ ప్రొడక్షన్స్ .. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాబీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్, చైతూ జోడిగా రాశి ఖన్నా తేరాకెక్కుతున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక రెండవ షెడ్యూల్ షూటింగు హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. రాజకీయాల నేపథ్యంలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. వెంకటేశ్ .. నాగచైతన్యలతో పాటు 100 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాలో నటిస్తున్నారు. Image result for venki mama

Leave a Response