నేను చూడలేదు కానీ నాకు నమ్మకం ఉంది…?

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ సినిమా అభిమానుల ముందుకి వచ్చింది. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా, ఈ నెల 19వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని చాలా బిజీగా వున్నాడట . తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. “నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం .. గల్లీ క్రికెట్ ఆడేవాడిని. అలాంటి నాకు .. క్రికెటర్ గా తెరపై చూసుకునే అవకాశం లభించింది. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన తరువాత ఇది ‘రమణ్ లంబా’ బయోపిక్ అనే ప్రచారం మొదలైంది. కానీ ఇది Image result for nani‘రమణ్ లాంబా’ బయోపిక్ కాదు .. ఇది ఫిక్షనల్ స్టోరీ అనే విషయం సినిమా చూసిన తరువాత అర్థమవుతుంది. ఇక ‘మజిలీ’ కథకు .. ‘జెర్సీ’కి మధ్య పోలికలు ఉన్నాయా అని చాలామంది అడుగుతున్నారు .. నేను ఇంకా ‘మజిలీ’ చూడలేదు. డేనియల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుని మరీ ‘జెర్సీ’లో నటించాను. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం నాకు వుంది” అని న్యాచులర్ స్టార్ నాని.

Leave a Response