బర్త్ డే స్పెషల్ గా ‘కడరమ్ కొండన్’ మేకింగ్ వీడియో…?

‘కడరమ్ కొండన్’లోను ఆయన కొత్త లుక్ తో కనిపించనున్నారు విక్రమ్. ఈ సినిమాకి లుక్ హైలైట్ అని టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి. సీనియర్ హీరో కమల్ హాసన్ సొంత బ్యానర్లో నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, రాజేశ్ ఎం.సెల్వ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజున విక్రమ్ పుట్టినరోజు .. 53వ వసంతంలోకి ఆయన అడుగుపెట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ మేకింగ్ వీడియోను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ మేకింగ్ వీడియో విక్రమ్ అభిమానులను ఫిదా చేస్తుందని భావిస్తున్నారు.

Leave a Response