టాలీవుడ్ యాంగ్ హీరో రామ్, రొమాంటిక్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇస్మార్ట్ శంకర్. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. రామ్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన టీజర్‌కి మాంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 12న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు పోస్టర్స్ ద్వారా ప్రకటించారు దర్శకుడు . మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఎనర్జిటిక్ రామ్ హీరో సరసన నిధి అగర్వాల్, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, చార్మీలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ పూర్తిగా డిఫ్రెంట్ బాడీ లాంగ్వేజ్ తో కనిపించనున్నాడు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం రామ్, పూరీ కెరియర్‌కి కీలకం కానుంది. ఈ సినిమాకోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంన్నారు.
previous article
మాస్ మహా రాజ్ న్యూ మూవీ…
next article
మొన్న తమ్ముడు ఇప్పుడు అన్న…?