తన కోసమే ఇదంతా….?

టాలీవుడ్ లో నటిస్తూ .. మరో వైపున తమిళంలో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ పై దృష్టి పెట్టింది మన అందాల సుందరి రకుల్. బాలీవుడ్ లో ఈ అమ్మడు నటించిన సినిమా ‘దే దే ప్యార్ దే’. ఈ సినిమా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా వసూళ్లు పెరుగుతుండటంతో రకుల్ ఫుల్ ఖుషీ అవుతోంది. బాలీవుడ్ లోని కొంతమంది దర్శక నిర్మాతలు ఆమెను తమ ప్రాజెక్టుల్లోకి తీసుకునేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నారన విషయం టాలీవుడ్ లో హల్ చల్ అవుతుంది. తాజా ఓ ఇంటర్య్వూలో రకుల్ మాట్లాడుతూ, తన సినిమాకి లభిస్తోన్న ఆదరణ పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసింది. పనిలో పనిగా రణ్ వీర్ సింగ్ ప్రస్తావన తీసుకొచ్చింది.Image result for rakul ఆయనంటే తనకి ఎంతో ఇష్టమనీ, ఆయన ఎనర్జీ ఒక రేంజ్ లో ఉంటుందని అంది. రణ్ వీర్ సింగ్ కి పెళ్లి కాకుండా వుంటే తాను చేసుకుని ఉండేదానినని చెప్పింది. ‘ఇప్పటివరకూ ఈ సంగతి చెప్పనే లేదూ’ అంటూ కొంతమంది గుసగుసలు పెట్టుకుంటూ ఉండగా, రణ్ వీర్ సింగ్ సినిమాలో ఛాన్స్ కోసమే ఇదంతా అనుకునేవాళ్లు మరికొంతమంది.

Leave a Response