జగన్‌ ప్రమాణస్వీకారానికి కేసీఆర్‌!

వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఈ నెల 30న చేయనున్న ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారని విశ్వసనీయంగా తెలిసింది. విజయవాడలో జరిగే కార్యక్రమానికి రావాలని జగన్‌ ఆయనను ఆహ్వానించినట్లు సమాచారం. దీనికి కేసీఆర్‌ సానుకూలత వ్యక్తంచేసినట్లు తెలిసింది ప్రమాణస్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌  వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను జగన్‌ ఆదేశించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియాన్ని ప్రమాణస్వీకార వేదికగా ఖరారు చేశారు. 30న ఉదయం 11.40 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య జగన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.  తెలంగాణ సీఎం కేసీఆర్‌11.50కి వచ్చే అవకాశం ఉంది

Leave a Response