టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా పులి. 2010లో అభిమానుల ముందుకు వచ్చిన`పులి`(కొమురం పులి)..అలాగే అదే ఏడాది మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం `ఖలేజా`. ఈ రెండు చిత్రాలను ఒకే నిర్మాత ఒకరే.. ఆయనే శింగనమల రమేష్. ఈ సినిమా వీడియో హక్కుల విషయంలో శింగనమల రమేష్, సి.కల్యాణ్ కలిసి భానుకిరణ్‌తో తమని బెదిరించారని షాలిమార్, యూనివర్సల్ వీడియోస్ సంస్థలు వీరిపై కేసులు పెట్టారు. అయితే ఈ కేసు నుండి శింగనమల రమేష్, సి.కల్యాణ్, భానుకిరణ్‌లకు నాంపల్లి సీఐడీ కోర్టు విముక్తి ప్రసాదించింది. ఎలాంటి ఆధారాలు లేనందున కేసును కొట్టివేస్తున్నట్టు సీఐడీ కోర్టు ప్రకటించింది.