ANR సినిమా తో ప్రేమకథ..

టాలీవుడ్ లో వచ్చినా సినిమాలో ఆణిముత్యాల్లాంటి సినిమా ‘మూగమనసులు’. ఇప్పుడు అదే టైటిల్ తో మరో ప్రేమకథను అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సౌజన్య దర్శకత్వంలో ఒక ప్రేమకథ పట్టాలెక్కనుంది. ఈ సినిమా ద్వారానే సౌజన్య దర్శకురాలిగా పరిచయం కానున్నారు. తాజాగా ఈ సినిమాకి ‘మూగమనసులు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ‘జెర్సీ’ ద్వారా పరిచయమైన హరీశ్ కల్యాణ్ ను హీరోగా ఎంపిక చేసుకున్నారు. కథానాయిక ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.Image result for harish

Leave a Response