జీవితంలో మనిషికి ఉండే తపన చూపిస్తున్న నాని…?

టాలీవుడ్ లో తన కంటూ ఒక స్థాయిని తెచ్చుకున్నాడు మన న్యాచులర్ స్టార్ నాని. తన నటనతో అందరిని తన వైపు తిప్పుకున్నాడు.ఇక అసలు విషయంలోకి వస్తే… క్రికెట్ లో ఎదగాలని భావించే ఓ యువఆటగాడు పడే తపన, ఆపై పదేళ్ల పాటు క్రికెట్ కు దూరమై, తిరిగి జట్టులోకి వచ్చేందుకు పడిన శ్రమను చూపుతూ నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ ట్రయిలర్ విడుదల చేశారు ఈ సినిమా దర్శకులు. యుక్త వయసులో ఆటలో అదరగొడుతుంటే, ఆకర్షణలో పడ్డ అమ్మాయితో హాట్ సీన్స్ కూ ఈ సినిమాలో కొదవలేదని ట్రయిలర్ చెప్పేసింది. కుమారుడు పుట్టిన తరువాత, సరైన సంపాదన లేక హీరో పడే అవస్థలు, డబ్బు కోసం భార్యను అడిగి కాదనిపించుకోవడం, ఆపై భార్య పర్సులోనే దొంగతనం చేయాలని చూడటం వంటి సెంటిమెంట్ సీన్లు కూడా ఉన్నాయట. మొత్తం మీద ‘జెర్సీ’లో అందరికీ కావాల్సిన అంశాలున్నాయని ట్రయిలర్ చెబుతోంది. నాని డైలాగులు కూడా అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి.

 

 

 

Leave a Response