10 కోట్ల షేర్ చేస్తున్న మజిలీ…?

యాంగ్ హీరో నాగచైతన్య.. సమంత జంటగా అభిమానుల ముందుకు వచ్చినా సినిమా. ‘మజిలీ’. ఈ సినిమా ద్వారా దివ్యాన్ష కౌశిక్ కొత్త హీరోయిన్ తెలుగు అభిమానులకు పరిచయమైంది. విభిన్నమైన ప్రేమకథా సినిమా గా నిర్మితమైన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి బాక్స్ అఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. నిన్న ఎన్నికల కారణంగా అన్ని కార్యాలయాలకు సెలవు ఉండటంతో, ఈ సినిమాకి అన్ని ప్రాంతాల్లోనూ వసూళ్లు పెరగడం టాలీవుడ్ లో విశేషం. నైజామ్ ఏరియాలో ఈ సినిమా ఇంతవరకూ 7 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ వీకెండ్ నాటికి ఈ సినిమా 10 కోట్ల షేర్ మార్క్ ను అందుకుంటుందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 21.14 కోట్లకు అమ్మడం జరిగింది. తొలి 5 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 21.61 కోట్ల షేర్ ను వసూలు చేసి, లాభాల బాటలోకి అడుగుపెట్టింది.

Leave a Response