100 కోట్లవైపు దూసుకెళ్తున్న మహర్షి….

టాలీవుడ్ మిల్క్ బాయ్ మహేష్ బాబు హీరోగా నటించించిన సినిమా ‘మహర్షి’. ఈ సినిమా ఈ నెల 9వ తేదీన అభిమానుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ ముద్దు గుమ్మా పూజ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలోను విజయ విహారం చేస్తోంది. రెండు వారాల్లో ఈ సినిమా 150 కోట్లకి పైగా గ్రాస్ ను, 90 కోట్ల షేర్ ను వసూళ్లు చేయడం విశేషం .Image result for mahesh babu

ఈ సినిమా 100 కోట్ల షేర్ ను రాబట్టడానికి మరెన్నో రోజులు పట్టదని అంటున్నారు. తన సిల్వర్ జూబ్లీ సినిమా ఈ స్థాయిలో ఆడటంతో మహేశ్ బాబు ఫుల్ హ్యాపీగా వున్నాడు. ఈ సినిమాతో ఆయన కొత్త రికార్డులను నమోదు చేయడం పట్ల అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ బాబు 26వ సినిమా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వుండనుందనే సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Leave a Response