త్రివిక్రమ్ తో అల్లు అర్జున్.. జూన్ 4 నుంచి తదుపరి షెడ్యూల్

టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో టాలీవు డ్ యాంగ్ హీరో అల్లు అర్జున్ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందుతోంది. ఈ మధ్యనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. అల్లు అర్జున్ కి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఎండలు మండిపోతుండటంతో బ్రేక్ ఇచ్చారు. తదుపరి షెడ్యూల్ ను జూన్ 4వ తేదీన మొదలుపెట్టనున్నారని సమాచారం. ఆ రోజు నుంచి 30 రోజుల పాటు ఏకధాటిగా షూటింగును జరపనున్నట్టు తెలుస్తోంది.Image result for allu arjun‘టబు’తో పాటు ప్రధాన పాత్రధారులంతా ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నారని అంటున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నాయికగా పూజా హెగ్డేను తీసుకున్నారు. రెండవ నాయికగా కేతిక శర్మను ఎంపిక చేసుకున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం.

Leave a Response