సంక్రాంతి బరిలో అల్లు అర్జున్…?

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు త్రివిక్రామ్, అల్లు అర్జున్ కలిసి ఒక సినిమా చేస్తోన్న సంగతి మన అందరికి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా టాలీవుడ్ ముద్దుగుమ్మ పూజా హెగ్డే నటిస్తుంది. ముందుగా ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనుకున్నారు. కానీ అదే సమయానికి చిరంజీవి ‘సైరా’ వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. అందువలన తమ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడమే మంచిదనే నిర్ణయానికి త్రివిక్రమ్ – అల్లు అర్జున్ వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే బాలకృష్ణ – కేఎస్ రవికుమార్ సినిమా, మహేశ్ బాబు – అనిల్ రావిపూడి మూవీ, సాయిధరమ్ తేజ్ – మారుతి సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్టుగా చెప్పేశారు. ఇక రజనీ – మురుగదాస్ కాంబినేషన్లోని ‘దర్బార్’ కూడా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంత గట్టి పోటీ ఉన్నప్పటికీ త్రివిక్రమ్ – అల్లు అర్జున్ తమ సినిమాను సంక్రాంతి బరిలోకి దింపాలని నిర్ణయించుకోవడానికి కారణం.

Leave a Response