షూటింగుకి సిద్ధమవుతోన్న ఎన్టీఆర్ – చరణ్

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి. ప్రస్తుతం ఎన్టీఆర్ .. చరణ్ హీరోలుగా ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షూటింగ్ లో బిజీ. ఈ సినిమా మూడవ షెడ్యూల్ షూటింగు జరుగుతూ ఉండగా, జిమ్ లో చరణ్ కాలు బెణకడం .. ఆ తరువాత ఎన్టీఆర్ చేతికి గాయం కావడం జరిగింది. దాంతో ఈ సినిమా షూటింగుకి కొన్ని రోజుల పాటు విరామాన్ని ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగును అతిత్వరలో మొదలుపెట్టనున్నారు. హైదరాబాద్ శివారు గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ .. చరణ్ .. అలియా భట్ తదితరులు ఈ షూటింగులో పాల్గొననున్నట్టు సమాచారం. ఇప్పటికే అనుకోని అవాంతరాల కారణంగా ఆలస్యం కావడంతో, ఇక పెద్ద గ్యాప్ తీసుకోకుండా చకచకా షూటింగు కానిచ్చేయాలనే నిర్ణయానికి రాజమౌళి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. Image result for rrr movie rajamouli

Leave a Response