బైక్ రేస్ చేస్తున్న విజయ్…

అర్జున్ రెడ్డి సినిమాతో సినీ లవర్స్ ని తన వైపు తిప్పుకున్నాడు మన యాంగ్ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో అభిమానులు ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన ఒక వైపున క్రాంతి మాధవ్ సినిమా చేస్తూనే, మరో వైపున ఆనంద్ అన్నామలై దర్శకత్వంలోను చేయనున్నాడు. ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళంలోను విడుదల చేయనున్నారట. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా తేరాకెక్కనున్నాడు. బైక్ రేసింగ్ కి సంబంధించి కొన్ని సన్నివేశాలు సహజంగా రావడం కోసం విజయ్ దేవరకొండ బైక్ రేసింగులో శిక్షణ పొందనున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో రోడ్ రేసింగ్ ఛాంపియన్ అయిన రజనీ కృష్ణన్ దగ్గర కొన్ని రోజులపాటు శిక్షణ తీసుకోనున్నాడు. ‘పేట’ సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న మాళవిక మోహనన్ ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయం కానుంది.Image result for vijay devarakonda bike

Leave a Response